(న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి): ప్రపంచంలోనే అత్యధికంగా పనిచేసే వయసుగల యువ జనాభాగల భారత్, అదే స్థాయిలో నిరుద్యోగ సమస్యను కూడా ఎదుర్కొంటోంది. దీన్ని పరిష్క రించడంతోపాటు జాతీయ ఉత్పత్తి పెంచేందుకు వీలుగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు పెద్దెత్తున ప్రోత్సహిం చాలని గతంలో ప్రభుత్వాలు ప్రతిపాదిం చాయి. అంతకు ముందు పరిశ్రమల ఏర్పాటుకు శాఖల వారీగా అనుమతుల సాధన కోసం తీవ్ర జాప్యం జరుగు తుండడంతో కొత్తగా సింగిల్‌విండో విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. ఈ విధానంలో ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు ఓ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్నిరకాల అనుమతుల్ని ఒకే చోట పొం దొచ్చు. పరి శ్రమకు అవసరమైన విద్యుత్, నీరు, ఫైర్‌సేఫ్టీ, కార్మిక, పరిశ్రమల, కాలుష్యం, ఎన్‌ఓసి, బిల్డింగ్ ప్లాన్, వంటి చట్టబద్దమైన అనుమతులన్నీ ఏకగవాక్ష వి ధానం క్రింద ఒకేచోట పొం దొచ్చు.
దరఖాస్తు చేసిన 50 రోజుల్లోగా ఈ అనుమతుల్ని సం బంధిత పరిశ్రమల శాఖ జారీ చేయాలి. 60 రోజుల్లోగా పరిశ్రమల ఏర్పాటుకనువైన పరిస్థితుల్ని కల్పిం చాలి. 50 రోజుల్లోగా అను మతుల జారీ లేదా దరఖాస్తును తిరస్కరిం చేందుగ్గల కారణాల్ని వివరించాలి. లేని పక్షంలో సదరు దరఖా స్తును పరిశ్రమల శాఖ ఆమో దించినట్లుగానే పరిగణించే హక్కు దరఖాసు దారుడికుండేది. దీంతో కొంత కాలం పాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు జోరుగా సాగింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ స్థాయి నుంచి సంపదను సృష్టించ డంలో ఈ పరిశ్రమలే కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇలా ఒకే చోట పరిశ్రమ ఏర్పా టుకు అవసర మైన అన్నిరకాల అనుమతులు జారీ కావడంతో సహజంగానే ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు కన్ను కుట్టింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలెవరూ వార్ని సంప్రదించడం లేదు. దరఖాసు ్తలపై కొర్రీలేసే అవకాశం వారికి కొరవడింది. దీంతో ఎవరూ ముడుపులివ్వడం లేదు.
అలాగే ఏకగవాక్ష విధానం క్రింద నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేస్తుండడంతో పర్యావర ణానికి హానిచేసే పరిశ్రమలకు అనుమతులు రాలేదు. శాఖల వారీగా అయితే ముడుపులు చెల్లించి ఇలాంటి పరిశ్ర మలు ఇబ్బందుల్లేకుండా అనుమతులు తెచ్చుగలిగేవి. వీరంతా కలసి ప్రభుత్వంపై ఒత్తిళ్ళు తెచ్చారు. ఏకగవాక్ష విధానం క్రింద అనుమతుల జారీ వల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం వస్తోందని, అర్హతలేని వ్యక్తులు కూడా పరిశ్రమల ఏర్పాటుకు అను మతులు సాధిస్తున్నారంటూ ప్రభుత్వం ముందు పోరెట్టారు. వీరి ఒత్తిళ్ళకు లొంగిన ప్రభుత్వం ఈ సింగిల్‌విండో విధా నాన్ని రద్దు చేసింది. దీంతో ఓ ఔత్సాహిక పారిశ్రమికవేత్త చిన్నస్థాయి పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రెండు డజన్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సొస్తోంది. ప్రతి కార్యాలయం ముందు రోజుల తరబడి అనుమతుల కోసం వేచి చూడాల్సొ స్తోంది. చిన్న చిన్న కొర్రీలేసి ముడుపులు గుంజే అధికారుల ముందు మోకరిల్లక తప్పడం లేదు. అనుమతుల కోసం పెద్ద మొత్తంలో వ్యయమౌతోంది. అలాగే ప్రాజెక్ట్ రిపోర్ట్‌కయ్యే ఖర్చులు కూడా బ్యాంకులు మూలధనంలో భాగంగా గుర్తిం చడం లేదు. దీనికి సంబంధించి బ్యాంకుల్నుంచి ఎలాంటి రుణాలు జారీ కావడం లేదు. దీంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నీరుగారిపోతున్నారు. ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరగలేక తమ ప్రతిపాదనల్ని విరమించు కుంటున్నారు.
భారీ పరిశ్రమలకైతే ప్రభుత్వాలే ముందుకొచ్చి పారిశ్రామికవేత్తల్తోఎమ్‌ఓయులు కుదుర్చు కుంటు న్నాయి. వారు డిమాండ్ చేసిన చోట అవసరమైన భూమిని సేకరించి మరీ సబ్సిడీ ధరపై వారికం దిస్తున్నాయి. వారు కల్పించే ఉద్యోగ, ఉపాధి అవ కాశాల్నిబట్టి విద్యుత్, నీటి సరఫరాలపై రాయితీ లిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా పెట్టుబడి సాయాన్ని ప్రభు త్వాలే అందిస్తున్నాయి. ఈ భారీ పరిశ్రమలకు ఏ చిన్ని ఇబ్బంది తలెత్తినా మంత్రులు నేరుగా బరిలోది గుతున్నారు. వారే వ్యక్తిగత శ్రద్ధతో ఆ సమస్యల్ని పరిష్కారించాలంటూ అధికారుల్ని ఆదేశిస్తున్నారు. దీంతో భారీ పరిశ్రమల ఏర్పాటు సుగమంగానే ఉంది. అయితే కొద్ది మోతాదులో పెట్టుబడి పెట్టి తమకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చౌకధరలో వినిమయ వస్తువుల తయారీకి ఉపక్రమిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మాత్రం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి.
గతంలో ప్రభు త్వాలు కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలకు ఆర్థిక సాయా న్నందించే వారు. కొన్ని కార్పొరేషన్లు నేరుగా చిన్న తరహా పరిశ్రమలో కొంత మొత్తాన్ని భాగ స్వామ్య పెట్టు బడిగా పెట్టేవి. దీంతో మూలధనాన్ని సమీకరిం చుకోవ డంలో ఔత్సాహికు లకు కొంత వెసులు బాటు లభించేది. రాన్రాను ఈ కార్పొ రేషన్లన్నింటిని ప్రభుత్వాలు మూసే శాయి. వాటి నుంచి కూడా ఔత్సా హికు లకు ఎలాంటి ఆర్థిక వెన్నుదన్ను లభించడం లేదు. ఈ నేపథ్యంలో వీరంతా ప్రతిపాదనల్ని పక్కనపెట్టి ఉద్యోగాల్లో చేరిపోవడం లేదా ఇతర దేశాలకు తరలి పోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలే కల్పిసు ్తన్నాయి.
ఏకగవాక్ష విధానాన్ని తిరిగి ప్రారంభిస్తే ఔత్సా హికుల ఆశలు నెరవేరుతాయి. వారి ఆకాంక్షల కనుగుణంగా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పడ తాయి. ఇవే పెద్ద సంఖ్య లో ఉపాధి అవ కాశాల్ని సృష్టిం చడం తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరు గు పరు స్తాయి. ప్రభు త్వాలు ఈదిశ గా దృష్టి సారిం చాలని నిపు ణులు సూచి స్తున్నారు.