Sunday, November 17, 2024

Exclusive – పరిపాలనలో డేరింగ్ రేవంత్‌

ఏడాది కాలంలో సాహ‌సోపేత నిర్ణ‌యాలు

ముఖ్య‌మంత్రిగా స‌రికొత్త నిర్ణ‌యాలు

ప‌రిపాల‌న‌లోనూ కొత్త పొక‌డ‌లు

స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపుతూ ముందుకు

ఉద్యోగ నియామ‌కాల‌తో నిరుద్యోగుల్లో ఉత్సాహం

- Advertisement -

టీజీపీఎస్పీ స్వ‌రూపం మార్చేందుకు చ‌ర్య‌లు

శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న అభివృద్ధి ప‌నులు

వ‌డ్ల కొనుగోళ్ల‌కు వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు

రైతుల‌ను మోసం చేసే వ్యాపారుల‌పై ఎస్మా ప్ర‌యోగం

సీరియ‌స్‌గా హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సీఎం రేవంత్‌

భ‌విష్య‌త్ త‌రాల ఫ్యూచ‌ర్ సిటీపై ఫుల్ క్లారిటీ

రీజిన‌ల్ రింగ్ రోడ్డు, మూసీ పున‌రుజ్జీవం

విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను లెక్క‌చేయని యంగ్ లీడ‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: ప్రజా పాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్న రేవంత్ ప్రభుత్వం కీలక అభివృద్ధి పనుల‌ను చేప‌డుతోంది. వ‌డ్ల‌ కొనుగోళ్ల దగ్గరి నుంచి మైనార్టీల సంక్షేమం దాకా ప్ర‌భుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి సీఎం స్వయంగా నియామక పత్రాలను సీఎం అందించారు.

గత 11 నెలల్లో తెలంగాణ ఏం పొందిందో సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటిదాకా వెనుకబడ్డ జిల్లా ఏదంటే అందరూ చెప్పేది మహబూబ్‌నగర్ జిల్లా గురించే.. అయితే.. ఇప్పుడు అదే పాలమూరు నుంచి సీఎంగా రేవంత్ రావడంతో రూపురేఖలు మార్చేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు.

పదేళ్లుగా, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించే పనికి తానే స్వయంగా బాధ్యత తీసుకున్నారు.

కురుమూర్తిస్వామి ద‌ర్శ‌నంతో..

ఈనెల 10వ తేదీన చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సీఎం రేవంత్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 110 కోట్ల రూపాయలతో కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని, కానీ, కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాకు పరిశ్రమలు, ప్రాజెక్టులూ రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పాలమూరు రుణం తీర్చుకుంటానని, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకువస్తామన్నారు. గ్రామాలకు, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదే అని, బీటీ రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలన్నారు. టీజీపీఎస్సీ స్వరూపం మార్చేందుకు శ్రీకారంతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్పుడు లీకులు, సరైన సిబ్బంది లేక ఇబ్బందులతో కనిపించేది.

కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం టీజీపీఎస్సీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేశారు. కొన్ని భర్తీలను ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామకం కింద ప్రభుత్వం అనుమతించింది.

టీజీపీఎస్సీ బలోపేతం కోసం కమిషన్‌ ప్రత్యేకంగా ఇటీవలే ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ లోతైన స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రకారం టీజీపీఎస్సీలోనూ యూపీఎస్సీ తరహా పరిపాలన, పరీక్షల నిర్వహణ విభాగాలు ఉండేలా చర్యలు సూచించింది.

నియామకాల జాతరచెప్పినట్లుగానే రేవంత్ ప్రభుత్వం నియామకాల జాతర కొనసాగిస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ పోస్టులకు ఎంపికైన వారికి ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. 113పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో రవాణాశాఖలో సిబ్బంది కొరత ఎక్కువైంది. దీంతో అపాయింట్ మెంట్ లెటర్లు అందించారు.

రైతులను మోసం చేస్తే ఎస్మావ‌డ్ల కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సీఎం దృష్టికి రాగానే ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేంది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

నాలుగు ఫ్యూచర్ ప్లాన్స్తెలంగాణ అభివృద్ధి గురించి సీఎం రేవంత్ పూర్తి విజన్ తో ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తాము పెట్టుకున్న లక్ష్యాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం… నాలుగు భవిష్యత్ లక్ష్యాల గురించి చెప్పారు. అందులో ఒకటి ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్ వంటివి పూర్తి చేసి తీరుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement