Saturday, November 23, 2024

ఇండియా ఎహెడ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

మనీష్ చిబ్బర్

ఢిల్లీ హైకోర్టు న్యాయవాది సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడంలో జరుగుతున్న జాప్యాన్ని మోదీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. 2017 అక్టోబరులోనే సౌరభ్ కిర్పాల్‌ను హైకోర్టు జడ్జిగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఇప్పటివరకు ఆ ప్రక్రియ వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాబ్డే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు లేఖ రాశారు. సౌరభ్ కార్పాల్ స్వలింగ సంపర్కుడు కాబట్టి ఈ ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారా అన్న విషయం నాలుగు వారాల్లో స్పష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఈ అంశాలను కేంద్ర న్యాయశాఖ వర్గాలు ఇండియా ఎహెడ్ న్యూస్‌కు అందించాయి. ఎక్కువ కాలం న్యాయమూర్తిగా కొనసాగిన సౌరభ్ కిర్పాల్‌ను జడ్జిగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు ఎందుకు వాయిదా వేశారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. 2020లో ఇదే విషయంపై తాను రాసిన లేఖపై ఇంకా కేంద్రమంత్రి రవిశంకర్ స్సందించలేదని లేఖలో బాబ్డే పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

కేంద్రమంత్రి రవిశంకర్‌కు బాబ్డే రాసిన తొలి లేఖలో ఇంటెలిజెన్స్ విభాగం చేసిన విశ్లేషణను కూడా ప్రస్తావించారని.. కిర్పాల్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించాలని కోరినట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా కిర్పాల్ ‘గే’ లాయర్ అని, అతడు మరో విదేశీ జాతీయుడితో లైంగికంగా సంబంధం పెట్టుకోవడం వల్ల దేశభద్రతకు ముప్పుగా పరిగణించబడుతుందని, భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా అతడిని హైకోర్టు జడ్జిగా నియమించడం సరికాదని 2019లో ఇంటెలిజెన్స్ వర్గాలు తమ నివేదికలో పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. అయితే ఎలాంటి రుజువులు లేకుండా కేవలం కిర్పాల్ సహా ఆయన సన్నిహితుల ఫేస్‌బుక్ పేజీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఈ నివేదిక ఇచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

ఈ విషయంపై సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో సంప్రదింపులు జరిపిన కొందరు సీనియర్ న్యాయమూర్తులు కిర్పాల్‌ను అర్హతను బట్టి, న్యాయశాస్త్ర పరిజ్ఞానం బట్టి న్యాయమూర్తిగా నియమించాలని.. కానీ లైంగిక ప్రాధాన్యతలను బట్టి అభ్యర్థిత్వాన్ని నిర్ణయించడం సరికాదని చెప్పినట్లు తెలిపాయి. పైగా స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాల విషయంలో సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశాయి.
కాగా కిర్పాల్ అంశంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో తన వైఖరిని తెలియజేయకపోతే సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందని సీజేఐ తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపాయి. ఏప్రిల్ 23న సీజేఐగా బాబ్డే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నాలుగు వారాల వ్యవధి ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం సమావేశానికి బాబ్డేను పిలుస్తారా అని ఇండియా ఎహెడ్ ప్రతినిధులు అడిగినప్పుడు సుప్రీంకోర్టు వర్గాలు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.

- Advertisement -

అయితే ఈ అంశంపై సౌరభ్ కిర్పాల్ స్పందించారు. తనపై ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిన విషయం నిజమేనని, కానీ అందులో ఏముందో తనకు తెలియదని.. న్యాయమూర్తుల మనసులో ఏముందో కూడా తనకు తెలియదని తెలిపారు. కొలిజీయం వ్యవస్థ పారదర్శకమైనదని తాను నమ్ముతున్నానని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని పేర్కొన్నారు. అయితే మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. తన భాగస్వామితో సమస్య వస్తుందని, తన లైంగికత ఈ ప్రక్రియతో సంబంధం ఉందని అర్థం చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement