కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.. హిట్లర్‌లా ప్రవర్తించే వాడు ఆయనలాగే చనిపోతాడని సీరియస్ కామెంట్స్ చేశారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే దీనిపై జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత చేసిన దూషణలు కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన భాషను ఉపయోగించడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని ఆయన మండిపడ్డారు.
“ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన భాషను ఉపయోగించడం కాంగ్రెస్ డిఎన్‌ఎలో ఉందనుకుంటా అన్నారు రఘుబర్ దాస్. ఎందుకంటే ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనను “మౌత్ కా సౌదాగర్ [merchant of death]” అని పిలిచేవారని మరోసారి గుర్తు చేస్తునట్టు చెప్పారు.
అలాంటి పదజాలాన్ని ఉపయోగించడం వల్ల గుజరాత్ ప్రజలు చాలా బాధపడ్డారని, అందుకే ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీ అఖండ విజయం సాధించారని ఆయన అన్నారు. ప్రజలు మోదీని మళ్లీ మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవడం ద్వారా ఆయనపై ప్రేమ చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొందని రఘుబర్ దాస్ అన్నారు.