జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఆయనపై కాల్పులు జరగడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన మరణించారు. షింజో అబే హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నరా ఏరియాలోని ఓ సభలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు అబేపై దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెడ భాగం నుంచి బుల్లెట్లు దూసుకుపోవడంతో.. తీవ్రంగా రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించారు. షింజో అబే చికిత్స పొందుతూ చనిపోయారని జపాన్ ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement