Friday, November 22, 2024

మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ‌కు ‘హైకోర్టు’లో ఊర‌ట‌

చొప్ప‌దండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ‌కు హైకోర్టులో ఊర‌ట క‌లిగింది. రూ.25వేల పూచీక‌త్తుతో శోభ‌ను విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. కాగా బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఉద్యోగుల బ‌దిలీల విష‌యంలో ఉన్న జీవో నెంబ‌ర్ 317ను స‌వ‌రించాల‌ని జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దీక్ష‌లో బండి సంజ‌య్, బొడిగె శోభ‌తో స‌హా మొత్తం 17 మంది ని కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసులు అరెస్టు చేశారు.అంతే కాకుండా జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇటీవ‌ల బండి సంజ‌య్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. తాజా గా బొడిగె శోభ కూడా త‌న రిమాండ్ ను ర‌ద్దు చేయాల‌ని హై కోర్టులో అత్య‌వ‌స‌న పిటిష‌న్ వేసింది. ఈ పిటిష‌న్ పై హై కోర్టు విచార‌ణ జ‌రిపింది. బొడిగే శోభ రిమాండ్ పై స్టే విధించింది. అలాగే బొడిగె శోభ అరెస్టు గురించి పూర్తి వివ‌రాలు హై కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే నెల 7 తేదీకి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement