మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు. గన్‌పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి.. అనంతరం రాజీనామా చేయనున్నారు. అసెంబ్లీకి వెళ్లి అక్కడ స్పీకర్ కార్యాలయంలో రాజీనామా చేయాలని ఈటల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈటల బీజేపీలో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 14 హైదరాబాద్ నుంచి ఈటల ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరనున్నారు. ఈటలతో పాటు కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకున్నాక నడ్డాను కలుస్తారు. తన వెంట వచ్చే నేతలను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈటల ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఈటల నివాసంలో శుక్రవారం బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో అశ్వత్థామరెడ్డి మంతనాలు జరిపారు.
కాగా, భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల.. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు