హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈటల ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ పింగిలి రమేష్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయనతో పాటు మరో అనుచరుడు చుక్కా రంజిత్ సైతం బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వామపక్ష భావాలున్న తాము బీజేపీలో ఇమడలేకపోతున్నామని..అందుకే పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అద్భుతమని కొనియాడారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నామని.. తేదీ త్వరలో చెబుతామని వెల్లడించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. ఈ అనూహ్య ఘటన మాజీ మంత్రి ఈటలకు గట్టి దెబ్బ అని అంటున్నారు. ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని భావించిన ఈటలకు… అధికార టీఆర్ఎస్ ఉహించని షాక్ ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి ఈటలతోపాటు బయటకి వెళ్లిన కీలక నేతలను తనవైపు తిప్పుకుంటోంది గులాబీ పార్టీ. ప్రత్యర్థులు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది.
ఇది కూడా చదవండిః మన్యం వీరుడు అల్లూరి దాడికి వందేళ్లు