తాను మరణించినట్టు న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. తాను కన్నుమూశానన్న విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండా తొందర ఏంటని ప్రశ్నించారు. నా మరణం గురించి ఇండోర్ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్ ఛానల్స్ చనిపోయినట్లు ఎలా చెబుతాయ ని ఫైర్ అయ్యారు. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ప్రశ్నించారు.
ఇక సుమిత్రా మహాజన్ మరణించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని ఉంచారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశిథరూర్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటనపై సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్ సైతం స్పందిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. తన తల్లిపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.