Friday, November 22, 2024

Counting Day : మరి కొద్ది సేపటిలో ఓట్ల లెక్కింపు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు… అనంతరం ఈవీఎంల కౌంటింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడనుంది. నెల రోజులపాటు విస్తృత ప్రచారం చేసిన నాయకుల భవితవ్యం బయటపడనుంది.. నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది.. . మొత్తం 119 స్థానాల నియోజకవర్గాల లెక్కింపు 49 కేంద్రాలలో చేపట్టనున్నారు.

ముందుగా ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం అరగంట తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఇక హైదరాబాదులో 15 నియోజకవర్గాలకు గాను కౌంటింగ్ సెంటర్స్ ను ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ను ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుళ్లు, ఉంటాయి

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

ఓట్ల లెక్కింపు ఎలా?
ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు రిటర్నింగ్ అధికారి. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మందిని ఉంచకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకుంటారు.

ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ ఫారం 17 సి లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి. కౌంటింగ్ కు ముందు 17 సి ఫారం ఆధారంగా పోలైన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఈవీఎంల సీన్లు తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీయంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తోంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు.

- Advertisement -

ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ఇలా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు ఏజెంట్ల సమక్షంలోనే కొనసాగుతోంది. రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. ఎన్నికల సంఘం పరిశీలికుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోవడానికి అర్హులు.. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇలా ఎన్నికల లెక్కింపును వీడియో తీసి వాటిని సీడీలలో భద్రపరుస్తారు. ఈ విధంగా భారీ భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement