Friday, November 22, 2024

Covid-19: మరో వేవ్​కి అంతా సిద్ధం కావాలి.. హెచ్చరించిన సైంటిస్ట్​ సౌమ్యస్వామినాథన్​

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయని.. మరో వేవ్​ కోసం ప్రజలంతా సిద్దంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. భవిష్యత్తులో వచ్చే అన్ని కొవిడ్ కొత్త వేరియంట్‌లు మరింత స్పీడ్​గా వ్యాప్తి చెందేలా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి నుంచి ఈజీగా తప్పించుకునేలా రూపాంతరం చెందుతున్నాయన్నారు. దీని ఫలితంగా ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు స్పందించడానికి అన్ని రకాల వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని ఆమె పలు దేశాలను కోరారు.

ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లోని సీనియర్ సలహాదారు ఫిలిప్ షెల్లేకెన్స్ చేసిన ట్వీట్‌పై స్వామినాథన్ స్పందిస్తూ.. ప్రపంచం కొవిడ్ -19 మరణాలలో యు-టర్న్ ను చూస్తోంది. కొన్ని నెలల తర్వాత మళ్లీ కేసులు పెరగడం గమనించవచ్చు అన్నారు. అయితే.. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్‌ వంటి అధిక ఆదాయం గల దేశాల నుంచి ఇతర దేశాలకు రాకపోకల ద్వారా కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని, మధ్య -ఆదాయ దేశమైన బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా వైరస్​ని వ్యాప్తి చేయడంలో అగ్రగామిగా ఉన్నాయన్నారు.

యూఎస్, బ్రెజిల్ ప్రస్తుతం ప్రపంచ మరణాలకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. USలో కొత్త Omicron వేరియంట్​ కేసులు పెరిగాయని, ఇటీవలి వారాల్లో వస్తున్నట్టు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యనే దీనికి ఉదాహరణగా చెప్పారు. అంతేకాకుండా మరణాలు కూడా పెరుగుతున్నట్టు వెల్లడించారు.

WHO వీక్లీ రివ్యూలో గత రెండు వారాల్లో కొవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంటువ్యాధిగా మారిన ఓమిక్రాన్ రిలేటెడ్​ అయిన BA.4, BA.5 ద్వారా కరోనా బాధిత కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ రెండు Omicron ఉప-వేరియంట్‌లు కూడా గతంలో టీకాలు వేసుకున్న వారికి, లేదా కొవిడ్ నుండి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement