ప్రజలెవరూ భయపడవద్దని, మంచి భవిష్యత్తు కోసం అంతా కలిసికట్టుగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ కోరారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మరోసారి బీజేపీపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదని, ఒంటిరి రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు. కోల్‌కతాలోని రైన్-డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో మంగళవారం జరిగిన ఈద్ ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రెడ్-రోడ్డులో జరిగిన ఈద్ ప్రార్థనల్లో సుమారు 14,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….”దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదు.. విభజించి పాలించే విధానాలు, ఒంటరి రాజకీయాలు ఏమాత్రం సరికాదన్నారు. భయపడొద్దు…కలిసికట్టుగా పోరాడుదాం”అని సీఎం అన్నారు. తాను కానీ, తన పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టదని భరోసా ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement