తనపై వస్తున్న వార్తలపై స్పందించింది బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి. ప్రముఖ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను త్వరలోనే పెళ్లాడనుందంటూ వచ్చిన వార్తలపై మాట్లాడింది..నేను ఎవరితోనూ వెళ్లడం లేదు. నా తల్లిదండ్రులు, నా కుటుంబంతో కలసి కొత్త ఇంట్లోనే ఉండబోతున్నాం అని చెప్పింది అతియా. దక్షిణ ముంబై ఆల్టమౌంట్ రోడ్డులో అతియాశెట్టి తన కుటుంబంతో ఉంటోంది. కేఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకోబోతున్న వార్తలను మీడియా ప్రతినిధులు ఆమె వద్ద ప్రస్తావించారు. ‘‘నేను ఈ ప్రశ్నలకు బదులివ్వను. వీటితో అలసిపోయాను. వీటిని విని నవ్వుకోవడమే చేయగలను. ప్రజలు వారికి నచ్చినట్టు ఆలోచించుకోనీయండి’’అని అతియాశెట్టి బదులిచ్చింది. అతియాశెట్టి పెళ్లి వార్తలను ఆమె సోదరుడు అహాన్ సైతం ఇటీవల ఖండించాడు. అటువంటి వేడుకే లేదని, వినిపించేవన్నీ వదంతులేనని అహాన్ తెలిపాడు. పెళ్లి లేనప్పుడు తాము సమాచారం ఎలా ఇచ్చేది అంటూ ప్రశ్నించాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement