Saturday, November 23, 2024

అంతా ఫసాక్.. షేక్ హ్యాండ్ ఇవ్వబోతే మోదీని పట్టించుకోని బైడెన్ (వీడియో)

జపాన్ వేదికగా ఇవ్వాల (మంగళవారం) క్వాడ్ కూటమి కీలక భేటీ జరిగింది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఈ క్వాడ్ కూటమిలో ఉన్నాయి. అయితే ఇండో పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ భేటీ ఏర్పడింది. ఇండో పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానంగా చర్చించింది.

అయితే.. టోక్యోలో జరిగిన భేటీకి భారత ప్రధాని మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ కలిసి వస్తున్నారు. ఇంతలో అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ వారిని ఆహ్వానిస్తూ రెండు చేతులు చాపుతాడు.. అయితే తననే బైడెన్ పిలుస్తున్నాడు అనుకుని ప్రధాని మోదీ స్పీడ్గా నడుస్తూ వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వబోతారు.. కానీ, అమెరికా అధ్యక్షుడు మన ప్రధానికి ఏమాత్రం పట్టించుకోకుండా ఆస్ట్రేలియా ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనితోనే మాట్లాడుతాడు.. కనీసం భారత ప్రధాని మోదీని పట్టించుకోను కూడా పట్టించుకోడు.. దీంతో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని భుజాన్ని తట్టి ఆ సిచ్యుయేషన్​ని మ్యానేజ్​ చేస్తారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రధాని మోదీని కించపరిచారని కొందరు.. అంటుంటే.. ఐపాయే, ఫసాక్ అంటూ ఇంకొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement