Friday, November 22, 2024

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అంద‌రూ బాగుంటారు.. ప్ర‌మాదాలు నివారించడానికే క‌ఠిన‌ చ‌ర్య‌లు: జాయింట్ సీపీ రంగ‌నాథ్‌

హైద‌రాబాద్ సిటీలో ఇకపై రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌కు రూ.1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200 జరిమానా విధించనున్నట్లు తెలిపారు జాయింట్‌ సీపీ రంగ‌నాథ్. జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్‌ నిబంధనలు కొత్తవేమీ కాదని అన్నారు. 2013 మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ జీవోలో ఇవ‌న్నీ ఉన్నవేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాకు ఈ అంశంపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ నెల 28 నుంచి ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు రంగ‌నాథ్‌. రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌లపై జరిమానాలు పెంచుతున్నట్లు తెలిపారు.

రాంగ్‌రూట్‌ డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రిపుల్‌ రైడింగ్‌ కూడా ప్రమాదాలకు కారణమవుతోందన్నారు జాయింట్ సీపీ రంగ‌నాథ్‌. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని, ఆదాయం కోసమే జరిమానాలు వేస్తున్నామనేది అవాస్తవమన్నారు. యూ టర్న్‌లపై తాము కూడా పునః సమీక్షిస్తామని, తరుచూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement