Sunday, November 3, 2024

అందరూ వార్ మెమోరియల్ చూడాలి.. స్టూడెంట్స్‌కి ప్రభుత్వాలే టూర్లు ఏర్పాటు చేయాలి: కిష‌న్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ సమీపంలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రతీ ఒక్కరూ సందర్శించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం వార్ మెమోరియల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అమరులైన వీర జవాన్లకు గుర్తుగా నేషనల్ వార్ మెమోరియల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో దాదాపు 23 వేల మంది అమరవీరుల పేర్లు, వివరాలున్నాయని తెలిపారు.

మనమంతా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నామంటే, అందుకు కారణం వేలాది మంది సైనికులు దేశ రక్షణలో ఉండడమేనని అన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, ఇతర కార్యక్రమాల కోసం ఢిల్లీ వచ్చేవారు నేషనల్ వార్ మెమోరియల్ సదర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులను ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియాల్ చూసేలా రాష్ట్ర ప్రభుత్వాలు టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement