తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి వడ్లని కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా.. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కోనుగొలు కేంద్రాలను ఖమ్మం నియోజకవర్గం మంచుకొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి లో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారని, 2.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలు ఉండగా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అదికారుల అంచన ప్రకారం అందుకు తగు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, అవసరం అయితే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల వివక్షకి నిరసనగా అలాగే తెలంగాణా రాష్ట్రంలో పండించిన యాసంగి పంటని కొనుగోలు చేయాలని గల్లి నుండి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహించినా కేంద్రప్రభుత్వంకు చలనం లేదన్నారు.
గ్రామపంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానాలు పంపిన స్పందించలేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నపటికీ కేంద్ర ప్రభుత్వం లో చలనం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మరుసటి రోజు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా యాసంగి ధాన్యం కొంటామని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు 12 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీ,15 వేల కోట్ల రైతు బంధు, పుష్కలంగా సాగునీరు ఇవ్వడం వల్ల పంటల సాగు పెరిగిందన్నారు.రైతులని రెచ్చగొట్టి యాసంగి లో వరి వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శించారు.యాసంగి ధాన్యంని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినందున యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి గా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు. ఎప్పటికైనా రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకునేది ఒక్క కేసిఆర్ మాత్రమే అని రైతులు దీన్ని గ్రహించాలన్నారు.