Tuesday, November 26, 2024

Omicron: ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. ముంబయిలో 141 మందికి ఒమిక్రాన్..

ముంబయి లోకల్ పీపుల్స్ కి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా ఒమిక్రాన్ వైరస్ అటాక్ అయ్యింది. ఈ మేరకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో వచ్చిన కరోనా కేసులకు సంబంధించి కొవిడ్ శాంపుల్స్ సేకరించామని, వారిలో దాదాపు 37శాతం మందికి అస్సలు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని, అయినా ఒమిక్రాన్ వైరస్ అటాక్ అయినట్టు తెలిపారు. 375 మంది నుంచి సేకరించిన శాంపుల్స్ లో 141 మందికి ఒమిక్రాన్ సోకిందని, వీరంతా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారేనని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ 141 మందిలో 89 మగాళ్లు, 52 మంది ఆడాళ్లున్నారు. వీరిలో 93 మంది రెండు డోసులు, మరో ముగ్గురు సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకున్న వారు ఉన్నట్టు తెలిపారు.

అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో 95 మందికి వైరస్ లక్షణాలు కనిపించగా, 39 మందికి అతితక్కువగా, ఏడుగురికి మధ్యస్తంగా కరోనా లక్షణాలున్నాయి. ఇప్పటికి ముంబయి సిటీలో 153 మందికి ఒమిక్రాన్ సోకగా వీరిలో 12 మంది మాత్రమే ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ కలిగి ఉన్నారు. అయితే ఎట్లాంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ముంబయి నివాసుల్లో అత్యధికంగా 21మంది అంధేరి వెస్ట్, జుహు, వెర్సోవాలల వారే ఉన్నారు. ఆ తర్వాత మలబార్ హిల్, మహాలక్ష్మి, టర్డియో ప్రాంతాల వారు ఉన్నారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement