Wednesday, November 20, 2024

Monkeypox: ఫారెన్​ టూర్​ పోకున్నా సోకిన మహామ్మారి​.. అంటువ్యాధిపై ఢిల్లీలో భయం భయం!

ఢిల్లీలో మరో మంకీపాక్స్​ కేసు బయటపడింది. ఓ 34 ఏళ్ల వ్యక్తికి ఈ లక్షణాలున్నట్టు తేలడంతో అతడిని మౌలానా ఆజాద్​ మెడికల్​ కాలేజీకి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. అయితే.. ఇప్పటిదాకా దేశంలో వెలుగులోకి వచ్చిన నాలుగు కేసుల్లో బాధితులంతా విదేశీ ప్రయాణాలు చేసిన వారుగానే తెలుస్తోంది. కానీ, ఢిల్లీలో మాత్రం బాధితుడు ఎటువంటి జర్నీ చేసిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు దేశ రాజధాని ప్రజలు.

బాధితుడికి విదేశాలకు వెళ్లిన ప్రయాణ చరిత్ర లేనందున ఇన్‌ఫెక్షన్ ఎట్లా వచ్చిందనే విషయాన్ని కనుగొనాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇంకా ఇట్లాంటి అంటు వ్యాధి  మరెవరైనా సోకిందా అనేదానిపై విస్తృత తనిఖీలు చేపట్టాలన్న డిమాండ్​ వినిపిస్తోంది. అయితే ఢిల్లీ బాధితుడికి విదేశీ పర్యటన వంటి రీజన్​ లేకున్నా.. అతను ఈమధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరిగిన ఒక స్టాగ్ పార్టీకి హాజరయ్యాడని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. కాగా, శనివారం అతని బ్లడ్​ శాంపిల్స్​ని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(NIV) కి పంపారు.  ఢిల్లీలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆప్​ అధినేత, సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement