Sunday, November 24, 2024

కేసీఆర్, హరీశ్ రావులకు ఈటల సవాల్

హుజురాబాద్ ఉపఎన్నిక నేపధ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఈటలను టార్గెట్ చేయగా… ఆయన కౌంటర్ ఇస్తున్నారు.  సీఎం కేసీఆర్‌‌కు దమ్ముంటే హుజూరాబాద్ ఎన్నికల్లో తన మీద పోటీ చేయాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తాను ఓడితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, గెలిస్తే సీఎం పదవికి కేసీఆర్‌‌ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. వాళ్లను, వీళ్లను నిలబెట్టడం కాదని.. కేసీఆర్ లేదా హరీశ్‌‌రావు ఇద్దరిలో ఎవరు నిలబడతారో చెప్పాలన్నారు. కేసులు పెట్టి బెదిరించడం కాదు, దమ్ముంటే నేరుగా కొట్లాడాలని హితవు పలికారు.

2001లో తన ఆస్తులెన్నో చెప్తానని, కేసీఆర్‌‌ ఆస్తులెన్నో చెప్తారా అని ప్రశ్నించారు. ఓటుకు రూ.20 నుంచి రూ. 30 వేలు ఇస్తామంటున్నారని, ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారని, ఆత్మగౌరవాన్ని అమ్ముకోరన్నారు. మనుషుల్ని కొనే నీచ సంస్కృతికి కేసీఆర్‌ దిగజారారని విమర్శించారు. హుజూరాబాద్‌‌లో అభివృద్ధి జరగలేదని హరీశ్‌‌రావు, టీఆర్‌‌ఎస్ లీడర్లు అబద్ధాలు చెబుతున్నారని ఈటల మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్ల పనులు మంజూరు అయ్యాయో.. హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని హరీశ్‌‌కు సవాల్ విసిరారు. ‘’వాళ్లు వీళ్లు కాదు.. మామా అల్లుళ్లు నిలబడండి. మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను గెలిస్తే సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తరా?’’అని ఈటల ప్రశ్నించారు.

ఏదో ఒక రోజు హరీశ్ రావును బొండిగ కూడా పిస్కుతరని అన్నారు. టీఆర్ఎస్ లో తనకు మాత్రమే అవమానం జరగలేదన్న ఈటల… తాను మాత్రమే కన్నీళ్లు పెట్టుకోలేదన్నారు. తాను, హరీశ్ రావులు ఎన్నో సార్లు అవమాన భారంతో కుంగిపోయినమో టైమొచ్చినప్పుడు డేట్‌లతో సహా చెప్తానని ఈటల స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండగ

Advertisement

తాజా వార్తలు

Advertisement