భూకబ్జా ఆరోపణలతో టిఆర్ ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చి బిజెపి పార్టీ కండువాన్ని కప్పుకున్నారు ఈటల రాజేందర్. ఈ మేరకు హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల కోసం టిఆర్ ఎస్ పార్టీ పన్నని వ్యూహాలు లేవు..ఇవ్వని హామీలు లేవు..దళితులని ఆకర్షించేందుకు దళితబంధు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చి పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నిక బాద్యతని మంత్రి హరీష్ రావుకి అప్పజెప్పింది తెలంగాణ సర్కార్. దాంతో టిఆర్ ఎస్ లోని పలువురు మంత్రులు..నాయకులు హుజురాబాద్ లో మకాం కూడా వేశారు. ఈ ఉప ఎన్నికల పోటీ టిఆర్ ఎస్..బిజెపిల మధ్యే ప్రధానంగా సాగింది. కాంగ్రెస్ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తో సహా మొత్తం 20మంది కాంగ్రెస్ నేతలు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు.
ఇక నువ్వా నేనా అని సాగిన ఈ ఎన్నికల్లో ఈటల గెలుపుతో బిజెపి రేసులో ముందుకొచ్చింది…ఇంకా రానున్న రోజుల్లో బిజెపి .. టిఆర్ ఎస్ పార్టీకి చుక్కలు చూపించనుందట. ఈటలని ఉపయోగించుకుని గులాబీ బాస్ కేసీఆర్ కి చుక్కలు చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారట బిజెపి నాయకులు. ఈ మేరకు ముఖ్యంగా ఈటలతో బీసీ మంత్రాన్ని ప్రయోగించనున్నారు. బీసీ నేతగా ఉన్న ఈటల ద్వారా… తెలంగాణలోని బీసీలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనుంది. తెలంగాణలో బీసీ ఓటర్లు అధికంగా ఉంటారు. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ముందు బీసీలని ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది.
గతంలో టీడీపీ ద్వారా బీసీలకు ఎక్కువ న్యాయం జరిగింది. అందుకే బీసీలు ఎక్కువగా టీడీపీకి మద్ధతుగా ఉండేవారు. కానీ టీడీపీని తోక్కేసి కేసీఆర్ బీసీలని తమవైపుకు తిప్పుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఈటల గెలుపుతో బీసీల్లో చీలిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటల రాష్ట్రమంతా తిరిగి బీసీలని..బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయనున్నారు. ఇదే విషయం కాంగ్రెస్ కూడా గమనిస్తోంది. బిసీలను ఆకట్టుకునేందుకు బిజెపి స్కెచ్ వేస్తోంది. అయితే ఇది కాంగ్రెస్‌కు ప్రమాదకరమని కాంగ్రెస్ బీసీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ కంటే ముందు అలెర్ట్ అయ్యి, బీసీలని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఈటల ప్రభావం బీసీలపై ఎక్కువ ఉంది… అలాగే దళితబంధు వల్ల బీసీలు టీఆర్ఎస్‌కు ఇంకా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఈటల… బీసీ మంత్రంతో కేసీఆర్‌కు అదిరిపోయే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి ఇప్పటి నుంచే పన్నాగాలు పనుతోంది. మరి గులాబి అధినేత బిజెపి స్కెచ్ లని ఎలా తిప్పి కొడతారో చూడాలి.