తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేంధర్ టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన తర్వాత.. ప్రభుత్వం పనితీరుపై ఈటల ఇప్పటికే పలు ఆరోపణలు చేస్తూవచ్చారు. తాజాగా మరో సంచలన విషయం బయటపెట్టారు. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపారని గతంలో వచ్చిన ఆరోపణలపై ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో స్పందించారు ఈటల. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుడదని కరోనా మొదటి వేవ్ సమయంలో కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
ఇక తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ ను సీఎం కేసీఆరే అట్టిపెట్టుకున్న నేపథ్యంలో..ముఖ్యమంత్రి తనపై బదులు తీర్చుకోవడం మానేసి కరోనా కట్టిడిపై దృష్టి పెట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈటల విజ్ఞప్తి చేశారు.