Friday, November 22, 2024

శుభవార్త: గంటల్లోనే ఖాతాల్లోకి EPFO డబ్బు..

EPFO ఫండ్స్ అప్లై చేసుకున్న కొన్ని గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. నాన్‌ కోవిడ్ క్లయిమ్ లను ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ ప్లాన్‌ చేస్తోంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. EPFO డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్‌ను ప్రస్తుతం సంబంధిత అధికారులు మ్యాన్యువల్‌ గా పరిశీలిస్తున్నారు. దీనివల్ల క్లయిమ్ పొందడానికి రోజుల తరబడి సమయం పడుతోంది.

అయితే..మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ మ్యాన్యువల్‌గా జరుగుతోంది. ప్రస్తుతం వీరికి 72 గంటల్లో డబ్బు జమ అవుతోంది. అలాగే నాన్‌ కోవిడ్ దరఖాస్తులు కూడా లక్షల్లో వస్తున్నాయి. దీంతో కేవైసీ అప్‌డేట్ ఉన్న వారందరికి ఆటోమెటిక్‌గా మనీ విత్ డ్రా అయ్యేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది మిలియన్ల కొద్దీ కోవిడ్-నాన్‌ కోవిడ్ క్లయిమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారు ఆర్థిక అవసరాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ చందాదారులలో సగానికి పైగా వారి ఆర్థిక అవసరాలను తీసుకోవడానికి 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 12 మధ్యకాలంలో తమ రిటైర్మెంట్ సేవింగ్స్‌లోని డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు. గతేడాది ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్‌ చందారులకు వారి ఫండ్ మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్‌ పే విత్ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement