మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. క్రైస్టచర్చ్లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందుంచింది. టాప్ ఆర్డర్ రానించడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగు చేసింది. ఓపెనర్ ఎలిస్సా హీలీ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. 138 బంతులు ఆడిన ఆమె 170 రన్స్ చేసింది. రాచెల్ హేన్స్ (68), బెత్ మూనీ (62) కూడా చక్కటి అర్ధ సెంచరీలు కొట్టారు. దీంతో ఆస్ట్రేలియా 356 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోల్ 3 వికెట్లు తీసుకున్నది. 10 ఓవర్లు వేసిన శ్రుబ్సోల్ 46 పరుగులు మాత్రమే ఇచ్చింది.
Women’s World Cup Final: ఫైనల్లో ఆసీస్ మహిళల దూకుడు… ఇంగ్లండ్ టార్గెట్ 357 రన్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement