ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. రత్‌తో టెస్ట్ సిరీస్ అనంతర క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. భారత్‌తో సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. తాజాగా టాక్‌స్పోర్ట్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌తో ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ మాట్లాడుతూ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. ‘ప్రస్తుతం నా మదిలో ఓ ఫన్నీ ఫీలింగ్ మెదులుతోంది. అది నిజం అవుతుందో లేదో నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ అనంతరం జేమ్స్ ఆండర్సన్ రిటైర్ అవుతాడని నాకు అనిపిస్తోంది. ఇదే నా మదిలో ఉన్న ఫన్నీ ఫీలింగ్. అండర్సన్ యాషెస్ సిరీస్ దాదాపు ఆడడు. ఓవల్, ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో మంచి ప్రదర్శన చేసి వీడ్కోలు చెపుతాడు. బహుశా విరాట్ కోహ్లీ వికెట్‌తో అతడు తన కెరీర్ ముగించొచ్చు’ అని హార్మిసన్ అన్నాడు.
జేమ్స్ ఆండర్సన్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు. అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు 600 కంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత అండర్సన్ మూడవ స్థానంలో నిలిచాడు. అండర్సన్ ఇంగ్లండ్ తరఫున 165 టెస్ట్ మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/42. అలాగే జిమ్మీ.. బ్యాట్స్‌మెన్‌గా 1246 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 81. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన అండర్సన్.. టెస్ట్ ఫార్మాట్లో కొనసాగేందుకు 2015లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు.
అండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఆండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 1529 ఓవర్లు వేసిన అండర్సన్.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 1792 మెయిడిన్ ఓవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇదే టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. ఇంగ్లీష్ గడ్డపై(స్వదేశంలో) టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ తొలి స్థానంలో ఉన్నాడు. మురళీ స్వేదేశంలో 73 టెస్ట్‌ల్లో 493 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జిమ్మీ (630) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఇది కూడా చదవండి: వాళ్లను పాకిస్థాన్ కి పంపిస్తాం: రాజాసింగ్