Tuesday, November 26, 2024

మూడో టీ-20లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ-20లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ సేన 18.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులతో విజృంభించడంతో ఇంగ్లీష్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. రాయ్ (9), మలాన్ (18), బెయిర్ స్టో (40) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ ధారాళంగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. సుందర్‌కు ఓ వికెట్ పడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 156/6 స్కోర్ చేసింది. ఓపెనర్ రాహుల్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్ డకౌట్, రోహిత్ (15), ఇషాన్ కిషన్ (4) విఫలం కావడంతో భారమంతా కోహ్లీ (77), పంత్ (25) మోయాల్సి వచ్చింది. తొలి 6 ఓవర్లలో ఆచితూచి ఆడటంతో భారత్ రన్‌రేట్ 5 పరుగుల లోపే నమోదైంది. కాగా ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టీ-20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ ద్వారా బెయిర్ స్టో అంతర్జాతీయ టీ-20 కెరీర్‌లో వెయ్యి పరుగులు సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement