Tuesday, November 26, 2024

మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. సిరీస్‌ 1-1తో సమం

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ జట్టుకి ఊహించని పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ టీమ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ జట్టుని ఓడించింది. శనివారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా అనూహ్యరీతిలో 278 పరుగులకే ఆల్ ఔట్ అయింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. నాటింగ్‌ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరి రోజు వర్షం కారణంగా డ్రాగా ముగియగా.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ సెప్టెంబరు 2 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది.

మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ భారత్ ను హడలెత్తించాడు. 5 వికెట్లు తీసి భారత్ ను  దెబ్బతీశాడు. క్రెగ్ ఒవెర్టన్ కు 3 వికెట్లు, ఆండర్సన్, మొయిన్ అలీకి చెరో వికెట్లు దక్కాయి. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. 78 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇంగ్లాండ్ పేసర్లు అండర్సన్, ఓవర్టన్ మూడేసి వికెట్లు తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ టీమ్.. కెప్టెన్ జో రూట్ 121 రన్స్ చేయడంతో 432 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లాండ్‌కి 354 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

ఇది కూడా చదవండిః రేవంత్‌రెడ్డికి షాక్.. సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement