ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు దాడులు చేస్తున్నారు. మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు అడుగుతున్నారు.
రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేస్తున్నారు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకు ల్లో భారీగా లోన్స్ తీసుకొని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు వినిపిస్తున్నారు. 2011లో రాంచీ – జoషెడ్పూర్ హై వే కాంట్రాక్ట్ ను మధుకాన్ కంపెనీకి అప్పగించారు. ప్రాజెక్ట్ కోసం మధుకాన్ కంపెనీ రూ. 1100 కోట్లు లోన్ తీసుకుంది. 264 కోట్లు రూపాయలు నిధులు పక్క దారి పట్టించునట్టు మదుకన్ కంపెనీపై అభియోగం నమోదు అయ్యాయి. నిధుల మళ్లింపుపై 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. మదుకాన్ డైరెక్టర్ లు శ్రీనివాస్ రావు, సీతయ్య, పృధ్వీ తేజ్ ల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.
రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంపై రాంచీ హై కోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. ప్రాజెక్ట్ స్కాం పై విచారణ చేయాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఝార్ఖండ్ హై కోర్టు ఆదేశించారు. సీబీఐ విచారణలో మాధుకాన్ ప్రాజెక్ట్ నుండి నిధులు మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్ హైవేలకు మళ్లించినట్లు ఎఫ్ఐఅర్ లో పేర్కొంది. 2012 లో మదుకాన్ ఆడిట్ సర్టిఫికెట్ లో సైతం తప్పులు చూపించిందని తెలిపింది. 6 ప్రాంతాలలో ఈడీ నామకు చెందిన కంపెనీల్లో సోదాలు చేస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.