తెలంగాణలో ఉల్లి సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం కావాల్సిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కావాల్సిన విధివిధానాలను రూపొందించే ఏర్పాట్లలో అధికారులున్నారు. కాగా, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సాగవుతున్న ఉల్లి పంటను పరిశీలించేదు ఇవ్వాల వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారుల బృందం వెళ్లింది.
ఈ టీమ్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఇతర అధికారులున్నారు. నాసిక్ జిల్లా ఏవ్లా తాలూకా అందర్ సూల్ గ్రామంలో రైతు నందకిశోర్ ఎండైత్ కు చెందిన ఉల్లి పంటను ఇవ్వాల వారు పరిశీలించి సాగు వివరాలు, పెట్టుబడి, ఆదాయం వంటి అంశాలను అధ్యయనం చేశారు.