అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంటూనే ఉంది. అయితే సినీ పరిశ్రమలో ఈ పేరు బాగా వినిపిస్తోంది ఈ మధ్య. కాగా క్యాస్టింగ్ కౌచ్ పై నటి, నిర్మాత, మంచులక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ఆమె ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ట్రోల్స్, కాస్టింగ్ కౌచ్ వాటిపై నోరు విప్పింది. తాను కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని.. తాను నటుడు మోహన్ బాబు కూతురిని, సినిమా ప్రపంచలోనే పుట్టి పెరిగాను కదా కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఎదురువుతుందని అనుకున్నాను అంటూ మంచు లక్ష్మీ పేర్కొంది. కానీ ప్రతి పరిశ్రమ, ప్రతీ రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆమె వెల్లడించింది. బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని మంచు లక్ష్మి బాంబ్ పేల్చింది. తన ఫ్రెండ్స్ ఎందరో వాటి గురించి చెబుతుంటారు. ఇక బాడీ షేమింగ్, ట్రోల్స్ అందరికీ ఎదురవుతుంటాయి. ఎలా ఉన్నా కూడా ట్రోల్ చేస్తుంటారు. వాటిని పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్లుగానే ఉండాలని సూచనలు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement