పంజాబ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. గురుదాస్ పుర్ సెక్టార్ లోని చందూవాడ్లా పోస్ట్ వద్ద పాకిస్థాన్ స్మగ్లర్ల కదలికను బీఎస్ ఎఫ్ గుర్తించింది. దాంతో వారు ప్రతిఘటించగా ఇరువర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ జవాను ప్రాణాలు విడిచారు. కాగా మరో జవానుకి గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉందని బీఎస్ ఎఫ్ వర్గాలు తెలియజేశాయి. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం … సుమారు 47 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు. ఏడు ప్యాకెట్లలో ఓపియం, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుబోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందని బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు. ఈ మేరకు దేశ సరిహద్దుల గుండా భారత్లోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పాకిస్థానీ స్మగ్లర్ల ప్రయత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..