Tuesday, November 26, 2024

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ అడవుల్లో ఎన్​కౌంటర్​, దళ కమాండర్ నగేష్ మృతి.. కొనసాగుతున్న ఆపరేషన్!​

వాజేడు (ప్రభ న్యూస్): తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛ‌త్తీస్‌గ‌డ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఛత్తీస్​గఢ్​ దళ కమాండర్ ఎన్​కౌంటర్​ కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఈ ఎన్​కౌంటర్​కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బిజాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ సహాయక ప్రాంతమైన కొరంజెడ్-బందెపరా అడవుల్లో ఎయిడెడ్ ఏరియా కమిటీ ఇన్‌చార్జి డీవీసీఎం నగేష్, సెక్రటరీ ఏసీఎం బుచ్చన్న, ఏసీఎం విశ్వనాథ్, మరో 15-20 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు, ఎస్​టీఫ్​, ప్రత్యేక బలగాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరాయి. మంగళవారం ఉదయం బందేపరా అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, ఏ కే 47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం.చేసుకున్నారు. కోరంజెడ్-బందెపరా అటవీప్రాంతంలో మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీస్ బలగాలు గుర్తించ్చాయి. ఎన్‌కౌంటర్ లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ జరగడంతో తెలంగాణ ఏజెన్సీ మండలాలలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏ క్షణమైనా మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడవచ్చునని పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసులు ముమ్మర తనిఖీ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement