ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,479 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణలో 262, ఏపీలో 117 ఖాళీలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు https://tribal.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు పూర్తి వివరాలు కావాలంటే వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మొత్తం పోస్టులు 3479 ఉండగా, అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 175 ఉన్నాయి. వైస్ ప్రిన్సిపాల్ 116 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1,244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1,944 ఖాళీలున్నాయి. తెలుగు రాష్ట్రాల పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 117 పోస్టులుండగా అందులో ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6 పోస్టులు, టీజీటీ ఖాళీలు 97 ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపాల్- 6 పోస్టులు, పీజీటీ పోస్టులు 77, టీజీటీ ఖాళీలు 168 ఉన్నాయి.