Tuesday, November 26, 2024

యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. ఎమ్మా గ్రాండ్ విక్టరీ

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. ఉత్కంఠగా జరిగిన పోరులో చివరికి 18 ఏళ్ల బ్రిటిష్ యువ కేరటం ఎమ్మా రదుకానుదే పై చేయి అయింది. కెనడాకు 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడించి చరిత్రను తిరగరాసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫయర్‌గా రికార్డులెక్కింది. 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ సాధించిన తొలి మహిళగా ఎమ్మా రికార్డు సృష్టించింది. అంతకుముందు 1977లో వర్జీనియా వేడ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.

150వ ర్యాంకర్ అయిన ఎమ్మా 73వ ర్యాంకర్ అయిన లెలాను ఓడించడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో ఎమ్మా తాను ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఒక్క సెట్‌ కూడా ఓడిపోకుండా, పరాజయం పొందకుండా టైటిల్ గెలుచుకోవడం విశేషం. ట్రోఫీతోపాటు ఎమ్మాకు 2.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఈ గెలుపుతో ఆమె  150 ర్యాంకు నుంచి అమాంతం 23కి ఎగబాకింది. ఇప్పుడామె బ్రిటన్‌లోనే నంబర్ వన్ క్రీడాకారిణి కావడం గమనార్హం.

ఇది కూడా చదవండిః తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్టులుః కేసీఆర్ కు కేంద్రమంత్రి హామీ

Advertisement

తాజా వార్తలు

Advertisement