Tuesday, November 26, 2024

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీ

రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తూర్పు ఉక్రెయిన్ లోని వేర్పాటు వాద ప్రాంతాల స్వాతంత్ర్యాన్ని గుర్తించి..అక్కడ శాంతిని కొనసాగించాలని రష్యా దళాలను ఆదేశించిన తర్వాత సమావేశం నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణ, డొనెట్స్క్-లుహాన్స్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రకటన చేసిన రష్యాపై ఆంక్షలను విధించడం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఉద్రిక్తలపై అమెరికా-రష్యా అధ్యక్షులు జో బైడెన్, పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కలిపిస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్ తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement