Saturday, November 23, 2024

ట్విట్ట‌ర్ డీల్ నుంచి త‌ప్పుకున్న ఎల‌న్ మ‌స్క్-న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న సంస్థ‌

ట్విట్ట‌ర్ డీల్ నుంచి త‌ప్పుకున్నాడు బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్.. ట్విట్ట‌ర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ట్విట్ట‌ర్‌ను ఖ‌రీదు చేయ‌నున్న‌ట్లు ఏప్రిల్‌లో మ‌స్క్ వెల్ల‌డించారు. అప్ప‌టి నుంచి ఆ భారీ ఒప్పందంపై ర‌క‌ర‌కాల అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌పై స‌మ‌గ్ర‌మైన స‌మాచారాన్ని ట్విట్ట‌ర్ ఇవ్వ‌లేక‌పోయింద‌ని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతుగున్న‌ట్లు మ‌స్క్ తెలిపారు. అయితే మ‌స్క్ నిర్ణ‌యంపై ట్విట్ట‌ర్ స్పందించింది.

మ‌స్క్‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. మ‌స్క్ అంగీక‌రించిన ధ‌ర‌కు, ష‌ర‌తుల‌కు లోబ‌డే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేల‌ర్ తెలిపారు.ట్విట్ట‌ర్‌ను కొనేందుకు ఏప్రిల్‌లో ఓకే చెప్పినా, మే నెల‌లో ఆ డీల్‌పై మ‌స్క్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఫేక్ అకౌంట్ల నేప‌థ్యంలో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు తెలిపారు. మొత్తం యూజ‌ర్ల‌లో ఫేక్ లేదా స్పామ్ యూజ‌ర్లు కేవ‌లం 5 శాతం లోపు మాత్ర‌మే ఉన్నార‌న్న విష‌యాన్ని నిరూపించాల‌ని మ‌స్క్ కండీష‌న్ పెట్టారు. అయితే ట్విట్ట‌ర్ సంస్థ ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు. బిలియ‌న్ డాల‌ర్ బ్రేక‌ప్ ఫీజు కోసం కోర్టులో కేసు దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement