Saturday, November 23, 2024

Breaking: తెలంగాణలో విద్యుత్​ షాక్‌.. 14శాతం పెరగనున్న క‌రెంటు బిల్లు?

తెలంగాణలో విద్యుత్​ చార్జీల పెంపు వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. 14శాతం విద్యుత్​ చార్జీలను పెంచుతూ టీఎస్​ ఈఆర్​సీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. డిమెస్టిక్​లో యూనిట్​కు 40 నుంచి 50 పైసలు, ఇతర కెటగిరీలలో యూనిట్​కు రూపాయి చొప్పున పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్టంలో 6,831 కోట్ల విద్యుత్​ చార్జీలు పెంపునకు ఈఆర్​సీ డిస్కంలు ప్రతిపాదనలు ఇచ్చాయి. సుమారు 4,037 కోట్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పాటు అంతర్గత సామర్థ్యంతో పూడ్చుకుంటామని డిస్కంలు ఈఆర్​సీకి ప్రతిపాదనలు పంపాయి. గత అయిదేళ్లుగా విద్యుత్​ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్​ చార్జీలు పెంచకతప్పడం లేదని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement