Friday, November 22, 2024

Electric Vehicle : కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌.. మీ ఎలక్ట్రిక్‌ వాహనంలో బ్యాటరీ సురక్షితమేనా?

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. రోజురోజుకూ మితిమీరిపోతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించే దిశగా కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వెహికిల్స్ ను ప్రోత్స‌హిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలని విడుదల చేసి మార్కెట్‌లో విక్రయిన్నాయి. ఇదే ఇప్పుడు బ్యాటరీ వాహనాల కొనుగోలు దారులకి చెమట‌లు పట్టిస్తున్నాయి. దేశంలో పలు చోట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు పేలి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. దానికి తోడు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంది. నాణ్యత లేని బ్యాటరీల కారణంగానే వాహనాలు పేలుడుకు గురవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేందుకు సైతం కస్టమర్లు జంకుతున్నారు. ఎలక్ట్రీక్‌ వాహనాలకు డిమాండ్‌ ఉన్నప్పటికీ భద్రత లేకపోవడంతో వినియోగదారులు ఈ బైక్స్‌ వాడేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. శిలజ ఇంధనం ఇంకా ఎంతకాలం లభిస్తుందో తెలియని పరిస్థితి. మరో వైపు కార్బన్‌ మోనాక్సైడ్‌ వల్ల వాయుకాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్రజలు సైతం ఆందోళనకు గురిచేస్తుంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ప్రపంచ దేశాలకు ఎలక్ట్రిక్ర్‌ వాహనాలపై దృష్టి పెట్టాయి. ప్రపంచ దేశాలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బ్యాటరీ వాహనాల కొనుగోలుపై ప్రత్యేక రాయితీని కల్పిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ పెరుగడంతో కొన్ని సంస్థలు వారికి నచ్చిన డిజైన్లతో వాహనాలను తయారు చేస్తున్నారు. ఇందులో నాణ్యత లేని బ్యాటరీల వినియోగం జరుగుతోందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే స్థాయిలో బ్యాటరీ వెహికిల్స్‌ కాలిపోతున్నాయి. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నాయి. నార్మల్‌ వెహికిల్స్‌ తో పోలిస్తే బ్యాటరీ వెహికిల్స్‌ ఖర్చు కూడా ఎక్కువగా ఉన్నది.

బ్యాటరీ పేలుడుకు కారణాలపై ఆరా..
ఈవీ ఫైర్‌ యాక్సిడెంట్స్‌ విషయంలో ఇండియన్‌ మేకర్స్ ను తప్పుపట్టడానికి లేదు. అయినా ఇప్పటి వరకు కచ్చితమైన ప్రమాద కారణాలు కనుగొనలేదు. నిజానికి ఇటువంటి విషాద సంఘటనలకు లిథియం – అయాన్‌ బ్యాటరీల్లోని థర్మల్‌ రన్‌ అవే కారణమవుతుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. థర్మల్‌ రన్‌అవే ఎలక్ట్రిక్ర్‌ వాహనాల్లో మంటలు కలిగించినప్పుడు వాటిని ఆర్పడం కూడా అంతే కష్టమని వారు పేర్కొన్నారు. ఇదొక ఎక్సో థర్మల్‌ ప్రక్రియ. సెల్ లో అంతర్గతంగా జరిగే రసాయన ప్రతి చర్యల వల్ల బ్యాటరీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మరింత వేడి ఉత్పన్నమవడంతో బ్యాటరీలో మంటలు ఏర్పడతాయి. ముఖ్యంగా వేసవిలో వాతావరణం 40 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఈ సందర్భాల్లో అది బ్యాటరీ మంటలను ప్రేరేపించే అవకాశముంటుంది. కానీ థర్మల్‌ రన్ అవే మాత్రమే ఇందుకు కారణం కాదనేది మరో వాదన. చాలావరకు ఆటోమేకర్స్‌ చైనా నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకుంటూ మార్కెట్ కు సబ్‌ స్టాండర్డ్‌ ఉత్పత్తులను అందిస్తున్నందున బ్యాటరీ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ మొత్తం ఫెయిల్‌ అవుతుంది. ఇలాంటి సంఘటనలను అరికట్టాలంటే ఆ దేశాల వాతావరణం, ఉష్ణోగ్రత, రహదారి పరిస్థితులకు అనువైన బ్యాటరీలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని కారణాలు..
ఈ బ్యాటరీలను వందల సార్లు చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. బరువు కూడా తక్కువే. మిగతా బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే. అయితే ఇవి పూర్తిగా సురక్షితమని చెప్పలేం. సాంకేతికంగా బ్యాటరీలో నాణ్యత లోపించడం, బీఎంఎస్‌ వంటి ప్రత్యేక కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి. బ్యాటరీ స్టోరేజ్‌ సిస్టమ్‌ సరిగా లేకపోవడం, ఓవర్‌ చార్జింగ్‌, డిశ్చార్జింగ్‌, వేడెక్కడం, సెల్‌ ఇంబ్యాలెన్స్‌ తదితర అంశాలు కూడా అగ్ని ప్రమాదాలను ప్రేరేపిస్తాయి. ఎలక్ట్రోల్రైట్‌ ద్రావణం కూడా పేలుడుకు కారణం కావచ్చు.

- Advertisement -

నాణ్యతా ప్రమాణాలు సూచించే మార్క్‌ ఉండాల్సిందే..
ఎలక్ర్టిక్‌ వస్తువుల నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్ఐ మార్క్‌, ఆహార పదార్థాల రక్షణకు ఎఫ్ఎస్ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా), సబ్బులకు టీఎఫ్ ఎం (టోటల్‌ ఫ్యాటి మాటర్‌) ఎలా అవసరమో ఎలక్ర్టిక్‌ వాహనాల్లో వినియోగిస్తున్న బ్యాటరీ ప్రమాణాలకు సంబంధించిన మార్క్‌ ఉండాల్సిందే అని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement