UP అసెంబ్లీ ఎన్నికలు 2022: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న AIMIM తన అనుకూల వర్గాలను చేరదీసే పనిలో పడింది. ఆచితూచి అడుగులు వేస్తూ తమ సామాజిక వర్గం బలంగా ఉన్న ఏరియాలో గెలుపు పట్టుబిగుస్తోందా. ఇస్లామిక్ విద్యా సంస్థ అయిన దారుల్ ఉలూమ్ కారణంగా UPలోని సహరన్పూర్ జిల్లాలోని దేవబంద్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేవ్‌బంద్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లున్నారు. అయినప్పటికీ ఇక్కడ కుల సమీకరణలు చాలా ఆసక్తికరంగా ఉంటయి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి విజయంపై కులాల సమీకరణ అనేది చాలా కీలకంగా మారుతుంది. దేవ్బంద్లో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుంది అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేవ్బంద్లో బీజేపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ సింగ్ ని నిలబెడుతుండగా.. సమాజ్‌వాదీ నుండి కార్తీక్ రాణాకు టికెట్ ఇచ్చిన విధానం.. ఈ అభ్యర్థులిద్దరూ ముస్లిమేతరులు కావడం ఇక్కడ మరింత చర్చకు దారితీస్తోంది. అయితే వీరిద్దరి పోటీలో దేవబంద్‌లో బలమైన ప్రాబల్యం ఉన్న మదానీ కుటుంబానికి చెందిన ఉమైర్ మదానీకి AIMIM టికెట్ ఇవ్వడం కూడా గట్టి పోటీ అవుతుందని స్థానికంగా అంటున్నారు.
‘‘దేవ్‌బంద్ ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం. అయితే ఎన్నికలలో విజయం గురించి మాట్లాడితే ఇక్కడ కుల సమీకరణాన్ని చూడాల్సిన అవసరం ఉంది. దేవ్‌బంద్ అసెంబ్లీ స్థానంలో కులాల సంఖ్యను పరిశీలిస్తే ఠాకూర్ – 57 వేలు, గుర్జార్- 30 వేలు, బ్రాహ్మణ – 35 వేలు, దళితులు – 65 వేలు, ముస్లిం – 90 వేలు, ఇతరులు49,500 మంది ఉన్నారు. చాలా ముస్లిం ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ముస్లిం సమాజంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో, ఈ సమాజంలోని ఎన్నికల సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి మేము దేవ్‌బంద్‌లోని పురాతన కుతుబ్ఖానా అంటే పుస్తక దుకాణానికి చేరుకున్నాము. ఇది దేవబంద్ దారుల్ ఉలూమ్ సమీపంలో ఉన్న ప్రదేశం. చాలా మంది ఇక్కడ గుమిగూడారు. వారందరితో చాలా సేపు మాట్లాడాము. ఈ సంభాషణలో దేవ్‌బంద్‌లోని ముస్లిం పెద్దలు, యువకులు అంతా ఎన్నికల సమస్యలు, గ్రౌండ్ రియాలిటీ, ముస్లిం ఓటు బ్యాంకు వల్ల కలిగే ప్రయోజనాలపై సమాధానాలు ఇచ్చారు’’. అని ఓ వార్త సంస్థ ప్రతినిధి బృందం తెలిపింది.
ఈ కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఈ సీటు నుండి ముస్లిం ఓట్లు ఒకవైపు ఉంటాయా, యోగి యొక్క 80–-20 ఫ్యాక్టర్‌కి పోటీ ఇస్తుందా అనే అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ఎందుకంటే AIMIM మదానీ కుటుంబానికి చెందిన ఉమైర్ మదానీని దేవబంద్ నుండి పోటీకి దింపింది. ఉమైర్ మదానీ మాజీ మంత్రి మసూద్ మదానీ కుమారుడు. ఇతను తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి తొలిసారి రాజకీయాల్లో తలపడుతున్నారు. మరి తర్వాత ఫలితం ఎలా ఉంటుందో ఎన్నికల తర్వాత పరిశీలించాల్సిందే.