Saturday, November 23, 2024

Elections: గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు.. మార్చి 10 రిజల్ట్..

గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. తీరప్రాంత రాష్ట్రంలో ఒకే దశలో ఎలక్షన్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలవడుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.

కాగా,  గోవాలో మనోహర్ పారికర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ ఈ సారి కూడా తమ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సారధ్యంలోని బీజేపీ 40స్థానాల్లో బహుముఖ పోటీ ఎదుర్కోబోతోంది. అయితే ఈ సారి గోవాలో తృణమూల్ కాంగ్రెస్ కొత్తగా పోటీ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా ఢిల్లీ సీఎం, ఆప్ అదినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా గోవాలో పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితా కూడా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని, ఈ సారి అధికారం కైవసం చేసుకోవాలని ఉవ్వీళ్లూరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement