రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు- ఆ తర్వాత వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈసీ కీలక నిర్ణయా లకు చేరువైంది. ఇందుకు సాంకేతికను అందిపుచ్చు కుంటోంది. ఈ యజ్ఞంలో ప్రజలను భాగస్వాములు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం పలు యాప్‌లను రెడీ చేస్తోంది. ఇటు- ఓటర్లు, అటు- కాండిడేట్స్‌కు యూజ్ అయ్యేలా వివిధ పోర్టళ్లు, వెబ్‌సైట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ పొలిటికల్ పార్టీలు, సభలు, సమావేశాలు ర్యాలీల నిర్వహణ కోసం అనుమతులు తీసుకునేందుకు మొదలుకొని ఓటర్లకు పోలింగ్ కేంద్రాల రూట్, ఇంటి నుంచే ఓటు వరకు అనేక మార్గనిర్దేశం ఈ యాప్‌లు చేయనున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులకు ఉపయో గపడేందుకు ఇంకొన్ని యాప్స్ రూపొందించారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎన్నికలిప్పుడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఓటర్లకు సకల సౌకర్యాలు, సదుపా యాలు ఈసీ నేరుగా ఏర్పాటు చేస్తోంది. ఎటువంటి ఇబ్బం దులు లేకుండా క్షణాల్లో సాంకేతికత సాయంతో ఓటరు హ్యాపీ గా ఫీల్ అయ్యేలా ఈసీ అధునాతన యాప్‌లతో ఓటరుకు చేరువవుతోంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపే సాంకేతికతను ఎన్నికల సంఘం సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. సాంకేతిక మొబైల్ యాప్‌లను ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మకంగా వినియోగంలోకి తెచ్చింది. ఓటర్ ఫ్రెండ్లీగా ఉంటూనే దివ్యాంగులు మొదలు, మహిళలు, సాఫ్ట్‌వేర్ నిపుణులను ఓటింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్న ప్రయ త్నాలు అత్యంత ఫలప్రదమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేయాలంటే అక్షరాస్యులకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఉల్లంఘ నలకు అడ్డులేకుండా పోయే పరిస్థితులు గతమే.. ఇప్పుడు వీటికి సీ విజిల్ యాప్‌తో ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అసెంబ్లి ఎన్నికల్లో మొబైల్ యాప్‌ల వినియోగం అధికారికంగా పెరిగింది. పారదర్శక, ప్రశాంత ఎన్నికలను సజావుగా నిర్వహించే లక్ష్యంతో ఓటర్లు, సిబ్బంది, దివ్యాంగులు ఈసీ తన సేవలను యాప్‌ల ద్వారా అందిస్తోంది. వీటన్నింటినీ ప్లే స్టోర్ లేదా యా ప్స్.ఎంజీవోవి.ఇన్ వెబ్‌సైట్ నుంచి లాగిన్ అయ్యాక డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసీఐ.ఎన్‌ఐసీ.ఇన్, ఎన్‌వీఎస్‌పీ.ఇన్ పోర్టల్‌లు కూడా అనేక సేవలు అందిస్తున్నాయి.
సీ విజిల్ పేరిట ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటు-లోకి తీసుకువచ్చింది. ప్రజలు గుర్తించిన, ప్రత్యక్షంగా అనుభవించిన, పార్టీలు, అభ్య ర్థుల అక్రమాలు, నేర పూరిత చర్యలు ఇందులో నమోదు చేస్తే చాలు. వెంటనే ఎన్నికల సంఘం రంగంలోకి దిగి వంద నిమి షాల్లో సదరు సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుం టుంది. ఎటువంటి చర్యలు తీసుకున్నదీ ఫిర్యాదు పంపిన వ్యక్తికి సంక్షిప్త సందేశం అందజేస్తారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇక సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల సౌలభ్యం కోసం హెల్పింగ్ యాప్‌ను రూపొందించారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వారు ఇందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు అధి కారులు రవాణా సదుపాయం కల్పిస్తారు. వాలంటీ-ర్‌ను అందు బాటు-లోకి ఉంచుతారు. దివ్యాంగులకు చక్రాల కుర్చీ సదు పాయాన్ని కల్పిస్తారు.
మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి (నో యువర్ క్యాండిడేట్ కేవైసీ)
నో యువర్ క్యాండిడేట్ పేరిట అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లు-ను ప్రజలకు అందు బాటు-లో ఉంచేందుకు ఎన్నికల సంఘం అఫిడవిట్. ఈసీఐ. జీవోవీ.ఇన్n వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థి ఎలాంటి వారు, వారి నేర చరిత్ర ఏమైనా ఉందా? ఏఏ ఆస్తులు ఉన్నాయనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు.
ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక యాప్‌ను ఎలక్షన్ కమిషన్ అందుబాటు-లోకి తీసుకొచ్చింది. ఇందులో ఓటు- నమోదు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తులు అందుబాటు-లో ఉంటాయి. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇ – ఎపిక్ కార్డ్‌ను డౌన్‌చేసుకునే సదుపాయం కల్పించింది.
ప్రజలకు ఎలక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ (ఎన్‌జీఎస్) పేరిట ఒక పోర్టల్ (సిటిజన్ సర్వీసెస్. ) అందుబాటు-లో ఉంది. ఓటర్స్ లిస్ట్‌కు సంబంధించిన ఏదైనా కం్లపంట్స్‌ను అందులో ప్రజలు నమోదు చేయవచ్చు. దేశ వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఫిర్యాదులైనా అందులో నమోదు చేయవచ్చు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర వివ రాల ను మనం అందులో నిక్షిప్తం చేస్తే సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి చర్యలు చేపడతారు.
సమాధాన్…
ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసేందు కు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫొటోలు, వీడియోలు ఆధారంగా పంపొచ్చు. తర్వాత అధికారులు తీసుకున్న చర్యల కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
సువిధ…
సభలు, సమావేశాలు, ర్యాలీలకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ యాప్ ద్వారా అనుమతులు కోరవచ్చు. వాహ నాలు, లౌడ్ స్పీకర్లు, పార్టీ కార్యాలయాలు, హెలీకాప్టర్ల విని యాగం, తదితర అంశాలకు సరైన పత్రాలిచ్చి ఆన్‌లైన్‌లో ఏకీకృత అనుమతులు పొందొచ్చు. తనకొచ్చిన 24 గంటల్లోగా ఈసీ పరిష్కారం చూపుతుంది.
ఎలక్టోరల్ సెర్చ్…
ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. తమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాన్ని, మ్యాప్‌ను, రూట్‌ను తెలుసుకునే వెసులుబాటుంది.
సుగమ్…
ఎన్నికల నిర్వహణలో వినియోగించే ప్రైవేటు వాహన వ్యవహారాలు పర్యవేక్షణకు ఆ యాప్ కీలకంగా పనిచేస్తోంది. వాహన యజమానాలు, డ్రైవర్లు, వారికి చెల్లింపుల వివరాలు ఇందులో ప్రత్యక్షమవుతాయి.
మైజీహెచ్‌ఎంసీ…
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ యాప్‌ను డెవ లప్ చేసింది. ఓటరుకు తన పోలింగ్ కేంద్రం తెలపడం తోపాటు, మొబైల్‌లో రూట్ చూపిస్తుంది.
ఈసీఐ.సిటిజన్ సర్వీసెస్.ఈసీఐ.ఇన్…
సమస్య తీవ్రతను బట్టి రిటర్నింగ్ అధికారి స్థాయి అధి కారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ వరకు ఎవరికైనా ఫిర్యా దులు ఇందులో నేరుగా చేయొచ్చు. నామినేషన్లు మొదలైన తర్వాత ఈ యాప్ మరింత వేగంగా పయనిస్తోంది. వచ్చిన ఫిర్యాదులపై జిల్లా రిటర్నింగ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు. దీంతో అత్యద్భుత ఫలితాలొస్తున్నాయి.