2017ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 17చోట్ల విజయాన్ని సాధించింది. కాగా 2017ఎన్నికల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ఆశ్చర్యకరం. కాగా నేడు గోవా రాష్ట్రానికి సంబంధించి తాజా ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న తరుణంలో కాంగ్రెస్ చేసిన పనికి ఆశ్చర్యపోయారంతా. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 13 స్థానాలు సొంతం చేసుకుంది. అధికారం ఏర్పాటుకు 21 స్థానాలు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీజేపీ చక్రం తిప్పింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ను కోరింది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినందున స్పీకర్ కాంగ్రెస్ వినతిని తిరస్కరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ఆశ్రయించగా, అక్కడా చుక్కెదురైంది. నాటి హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement