Wednesday, November 20, 2024

కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఛైర్మెన్ ఎన్నిక‌ల విచార‌ణ నుంచి త‌ప్పుకున్న జ‌డ్జి

కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిక‌కి సంబంధించిన విచార‌ణ బెంచ్ నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్టు ఏపీ హైకోర్టు జ‌డ్జి ప్ర‌క‌టించ‌డం విశేషంగా మారింది. దాంతో ఈ కేసును మ‌రో బెంచ్ కి త‌ర‌లించారు. కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు హ‌క్కుని న‌మోదు చేసుకోవ‌డంపై వైసీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. గ‌తంలో విజ‌య‌వాడ కార్పొరేష‌న్ లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని వైసీపీ గుర్తు చేసింది.. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కును నమోదు చేసుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు హక్కుపై నేడు విచారణ జరిగింది. వైసీపీ కౌన్సిలర్ల తరపున వాదనలను వినబోనని హైకోర్టు జ‌డ్జి ప్రకటించారు. అస‌లు ఈ కేసు విచార‌ణ బెంచ్ నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తితో వైసీపీ కౌన్సిలర్ల తరపున వాదిస్తున్న న్యాయవాది వాదనకు దిగారు. తన వాదనలను వినాలని అడ్వ‌కేట్ పట్టుబట్టారు. అయితే న్యాయవాది వాదనలను వినబోనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు కేసు విచారణ నుండి కూడా తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement