Friday, November 22, 2024

బిఆర్ఎస్ లో మొద‌లైన ఎన్నిక‌ల సంద‌డి – ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్న నేత‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల ఏడాదిలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) నేతలు క్షేత్రస్థాయిలో ముందున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సాధారణ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ప్ర జల్లోకి వెళుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రాతినిథ్యం వహి స్తున్న ఎమ్మెల్యేలతో పాటు ఈ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలు కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, ఇంటింటికి ఎమ్మెల్యే వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ఎనిమిదేళ్ల పాల నలో బీఆర్‌ఎస్‌ సర్కారు అందించిన స్కీమ్‌ల ద్వారా లబ్ధిపొందిన వారిని నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి పార్టీలుగా భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులెవరో తేల్చుకోలేక పోతున్న తరుణంలో అధికార పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళుతుండడం విశేషం. వచ్చే ఎన్నికల రేసులో మళ్లిd బీఆర్‌ఎస్సే ముందంజలో ఉందని చెప్పడానికి ఈ పరిణామాలు చాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో అయితే మంత్రులే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సైకిల్‌ యాత్రలు, పాదయాత్రలు చేస్తామని, ప్రజలకు ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని ప్రకటిస్తుండడం ఎన్నికల వేడిని సూచిస్తోంది.


బూత్‌ స్థాయిలో నాయకులను అలర్ట్‌ చేస్తున్న జిల్లా అధ్యక్షులు…
పార్టీకి 33 జిల్లాల్లో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికలకు సమాయత్త మవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు ఈ ఆదేశాల అమలులో భాగంగానే జిల్లా స్థాయిలో పార్టీని గ్రౌండ్‌లో మరింత పటిష్టంగా మార్చేందుకు జిల్లా అధ్యక్షులు చర్యలు ప్రారంభించారు. కొన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే జిల్లాలో ఉన్న నియో జకవర్గాల్లోని బూత్‌ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తు న్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ కార్యక్రమాలన్నీ పటిష్టంగా అమల వ్వాలని జిల్లా అధ్యక్షులు బూత్‌ స్థాయి నాయకులకు ఆదేశిస్తున్నారు. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు కావడంతో సొంత నియోజకవర్గంలో వ్యవహారా లను చక్కబెట్టుకుంటూనే జిల్లా పార్టీ బాధ్యతలను వారు సమగ్రంగా నిర్వర్తిస్తున్నారు.
కేటీఆర్‌ పర్యటనలతో క్యాడర్‌లో జోష్‌…
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆయా జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో గ్రూపు కొట్లాటలు పక్కనపెట్టి పార్టీని మరింత పటిష్ట పరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గాల స్థాయిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న ఉత్తేజపరిచే ప్రసంగాలతో పార్టీ క్షేత్రస్థాయి నాయకులకు ఉత్సాహం నింపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లిలో కేటీఆర్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడిన తీరు ఎన్నికల సభను గుర్తు చేసిందన్న చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో కేటీఆర్‌ మరింత విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement