భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులు కానున్నారు. సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంఘంలో సీనియర్‌ను సీఈసీగా నియమించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోడా రవి కాలం నేటితో ముగియనుంది. తర్వాత సీనియర్ అయిన సుశీల్ చంద్ర నియామకం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది.
మంగళవారం సీఈసీగా సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులైన సుశీల్ చంద్ర పదవీకాలం 2022 మే 14 వరకూ ఉంది. ఆయన ఆధ్వర్యంలో గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.