Tuesday, November 26, 2024

తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ… ఎన్నికలు నిర్వహిస్తారా?

తెలంగాణ మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఇందులో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా అదే జూన్16న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

వచ్చే నెల గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిఫ్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు ఉన్నారు. ఇక, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కాగా, గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో ఈ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశంఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికలు జరుగుతాయా అన్నది ఉత్కంఠగా మారింది.

ఇదిలావుంటే, అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే ఈ ఆరు ఎమ్మెల్సీ పదవులనూ ఆ పార్టీకే దక్కనుంది. మరోవైపు పార్టీలో ఎమ్మెల్సీ పదవి  ఆశిస్తున్నవారి సంఖ్యనే కూడా అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు ? అనేది సస్పెన్స్ గా మారింది.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌లో ఎమర్జెన్సీగా బయటకు వెళ్లాలా? ఇలా చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement