Thursday, November 21, 2024

Breaking: యూపీ ఎన్నికలు, కొవిడ్ పరిస్థితులపై ఎలక్షన్ కమిషన్ సమీక్ష..

2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ సమీక్ష నిర్వహించింది. ఈ మేరకు యూపీలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించనున్నట్టు తెలిపింది. రాష్ట్ర, జిల్లా అండ్ డివిజనల్ అధికారులతో మాట్లాడి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

‘‘అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మమ్మల్ని కలుసుకున్నారు. అన్ని COVID-19 ప్రోటోకాల్‌లను అనుసరించి సమయానికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. అన్ని ఓటింగ్ బూత్‌ల వద్ద VVPATలను ఇన్‌స్టాల్ చేయాలి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా దాదాపు 1 లక్ష ఓటింగ్ బూత్‌లలో లైవ్ వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 2017 UP అసెంబ్లీ ఎన్నికలలో 61% ఓటింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 59% ఓటింగ్ నమోదైంది. ప్రజల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉందనేది ఆందోళన కలిగించే అంశం’’. అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement