Saturday, November 23, 2024

నేడు ఆర్‌వీఎంపై అన్ని పార్టీల‌తో ఎన్నిక‌ల సంఘం భేటీ

దేశంలోని జాతీయ‌, ప్రాంతీయ‌ పార్టీల‌తో ఈరోజు భార‌త ఎన్నిక‌ల సంఘం స‌మావేశం కానుంది. రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్‌వీఎం) మీద‌ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ మెషిన్ ప‌నితీరు గురించి రాజ‌కీయ పార్టీల‌కు వివ‌రించ‌డంతో పాటు ప‌లు విష‌యాల మీద చ‌ర్చించ‌నుంది. అందుకని 8 జాతీయ‌ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీల‌కు చెందిన‌ అధ్య‌క్షులు, జ‌న‌ర‌ల్‌ సెక్ర‌ట‌రీలు ఈ మీటింగ్‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని ఈసీ కోరింది. అంతేకాదు ఈ కొత్త మెషిన్ల ప‌నితీరుకు సంబంధించి, ఎన్నిక‌ల ప‌ద్ధ‌తిలో మార్పులు, దేశంలోని వ‌ల‌స కూలీల‌ గురించి త‌మఅభిప్రాయాలను రాత పూర్వ‌కంగా జ‌న‌వ‌రి 31లోపు తెలియ‌జేయాల‌ని చెప్పింది. ఈ అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘానికి చెందిన‌ సాంకేతిక నిపుణులు కూడా పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement