అఖిల పక్ష నేతలతో భారత ఎన్నికల సంఘం సమావేశమైంది. రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్‌వీఎం) మీద అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ మెషిన్ పనితీరు గురించి రాజకీయ పార్టీలకు వివరించడంతో పాటు పలు విషయాలపై చర్చిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజలకు ఓటు సదుపాయం కల్పించే అంశంపై కూడా చర్చిస్తున్నారు. 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఈ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని ఈసీ కోరిన విషయం విధితమే. అయితే ఈ కొత్త మెషిన్ల పనితీరుకు సంబంధించి, ఎన్నికల పద్ధతిలో మార్పులు, దేశంలోని వలస కూలీల గురించి తమఅభిప్రాయాలను రాత పూర్వకంగా ఈనెల 31లోపు తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement