Friday, November 22, 2024

Breaking: కొవిడ్ చర్యలపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ ఆరా.. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎల‌క్ష‌న్స్‌?

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసే అవకాశం లేదని కొంత‌మంది అధికారులు అంటున్నారు. అసెంబ్లీల గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ ఆదేశం ప్రకారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌కు కట్టుబడి ఉండే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు.

కాగా, గోవా అసెంబ్లీ పదవీకాలం మార్చి 15తో ముగియనుండగా, మణిపూర్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 19తో ముగుస్తుంది, యూపీ అసెంబ్లీ పదవీకాలం మే 14 వరకు ఉంది.

ప‌లు రాష్ట్రాల్లో Omicron కేసులు పెరుగుతున్నందున ఎన్నికల సంఘం రాబోయే ఎన్నికలపై ఆరోగ్య కార్యదర్శితో సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కవరేజీ, ఓమిక్రాన్ కేసుల వివరాలను ఎన్నిక‌ల సంఘం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై ఒమిక్రాన్ ప్ర‌భావం ఉంటుంద‌న్న వాద‌న‌ల‌పై కఠినమైన కొవిడ్ ప్రోటోకాల్ ఆవశ్యకతపై కూడా ఎన్నికల సంఘం చర్చించినట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement